Suicide: మేడికొండూరు పీఎస్‌ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య.. వేధింపులే కారణమా?

తాజా వార్తలు

Published : 09/10/2021 07:25 IST

Suicide: మేడికొండూరు పీఎస్‌ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య.. వేధింపులే కారణమా?

ఈనాడు, అమరావతి, మేడికొండూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పాలడుగు ఎస్సీ కాలనీకి చెందిన వేల్పూరి ఆనందరావు(43) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు విచారణ నిమిత్తం తన భర్తను పదేపదే పిలిచి నేరం అంగీకరించాలని ఒత్తిడి చేయడం, పలు రకాలుగా ఇబ్బందులు పెట్టడం వల్లే భయాందోళనలకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి భార్య రాణి ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆనందరావు గ్రామ శివారులోని పత్తి పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని విలపించారు. అయితే ఉదయం పోలీసు వేధింపులని చెప్పిన ఆమె సాయంత్రం పత్తి పంటలో నష్టం వచ్చినందున తన భర్త ప్రాణం తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆనందరావు అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపంతో పురుగుమందు తాగి చనిపోయాడని పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ మాట్లాడుతూ.. ‘మృతుడిని ఇంతకు ముందు విచారణకు పిలిచిన మాట వాస్తవమే. విచారణలో ఇబ్బంది పెట్టలేదు. అసత్యాలను ప్రచారాలు చేయొద్దు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాస్తవాలేమిటో రెండు రోజుల్లో వెల్లడిస్తాం’ అని తెలిపారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని