Crime News: గండి మైసమ్మ వద్ద ఘోర ప్రమాదం: ఒకరు మృతి

తాజా వార్తలు

Updated : 06/09/2021 05:29 IST

Crime News: గండి మైసమ్మ వద్ద ఘోర ప్రమాదం: ఒకరు మృతి

మేడ్చల్‌: గండి మైసమ్మ నుంచి మియాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బాచుపల్లి నుంచి గండి మైసమ్మ వైపు వెళ్తోన్న కారు బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఎదురుగా వస్తోన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శంకర్‌ రెడ్డి  అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అతని మృతదేహం అందులోనే ఇరుక్కుపోయింది. ప్రమాద సమయంలో వెనుక నుంచి వస్తున్న ఓ ద్విచక్రవాహనదారుడికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సుమారు గంటపాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు కూకట్‌పల్లి వాసిగా గుర్తించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని