Couple Suicide: కుటుంబ కలహాలతో ఉరేసుకొని దంపతుల బలవన్మరణం 

తాజా వార్తలు

Published : 07/09/2021 01:18 IST

Couple Suicide: కుటుంబ కలహాలతో ఉరేసుకొని దంపతుల బలవన్మరణం 

మిరుదొడ్డి: కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాజు(30), మమత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మోక్షవర్ధన్‌, మనస్విత్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. దంపతుల మధ్య ఆరు నెలల కిందట మనస్పర్థలు వచ్చి తరచూ గొడవ పడేవారు. ఇదిలా ఉండగా, దేవరాజు కుటుంబం, అతని తల్లిదండ్రులు రాములు, దేవవ్వతో కలిసి వన భోజనాల కోసం మోతె గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.

కార్యక్రమం అనంతరం రాత్రి సమయంలో పిల్లల్ని, తల్లిదండ్రులను అక్కడే వదిలేసి దేవరాజు దంపతులు స్వగ్రామానికి వచ్చారు. ఇంటికి వచ్చిన అనంతరం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన దంపతులిద్దరూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని