cyber crime : హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

తాజా వార్తలు

Published : 14/08/2021 01:11 IST

cyber crime : హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలు చెప్పి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  స్కూల్‌ ఫ్రెండ్‌ని అంటూ సైబర్‌ మోసగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నారు. ల్యాప్‌టాప్‌, విలువైన గిఫ్టులు, డాలర్స్‌ పంపిస్తున్నానని నమ్మించారు. అనంతరం ఎయిర్‌ పోర్టు అధికారులమని కాల్ చేసి.. కస్టమ్స్, జీఎస్టీ, ఇతర ఛార్జీల పేరుతో విడతల వారీగా రూ.14 లక్షలు వసూలు చేశారు. చివరికి మోసపోయానని తెలుసుకున్న మహిళ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. సైబర్‌ క్రైమ్‌పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వచ్చంధ సంస్థ పేరుతో..

స్వచ్చంధ సంస్థలో 39లక్షల డాలర్లు ఉన్నాయని ముషీరాబాద్‌కి చెందిన సంతోష్‌కుమార్‌కు సైబర్‌ కేటుగాళ్లు మెయిల్‌ పంపారు. కమీషన్‌ తీసుకుని ఆ డబ్బును వైట్‌ మనీగా మార్చాలని నమ్మించారు. అనంతరం ఆర్బీఐ మేనేజర్‌నంటూ కాల్‌ చేశారు. ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ ఛార్జీలు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ఇతర ఛార్జీల పేరుతో రూ.4.23లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని