AP News: కడపలో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 21/07/2021 11:00 IST

AP News: కడపలో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కడప నేరవార్తలు: కడప జిల్లా కోర్టు ఆవరణలోని పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మంగళవారం రాత్రి పోలీస్ కంట్రోల్ కార్యాలయానికి విధుల నిమిత్తం వచ్చారు. ఇవాళ ఉదయం కోర్టు సిబ్బంది చూసేసరికి విజయ కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే విషయాన్ని ఒకటో పట్టణ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గత కొంత కాలంగా విజయ్‌కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని