కడప జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్య కాలు, చేయి నరికేసిన భర్త

తాజా వార్తలు

Updated : 16/09/2021 08:28 IST

కడప జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్య కాలు, చేయి నరికేసిన భర్త

చక్రాయపేట: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిన భర్త అనుమానంతో కట్టుకున్న భార్య కాలు, చేయిని కొడవలితో నరికేసిన ఘటన చక్రాయపేట మండలం బీఎన్‌ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లావత్‌ నాగనాయక్‌, ఈశ్వరమ్మ (45)కు పాతికేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లపాటు వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగిందని బంధువులు తెలిపారు. 

ఇటీవల భార్యపై అనుమానంతో భర్త నిత్యం వేధించేవాడన్నారు. ఈ క్రమంలో బుధవారం దంపతులిద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంలో నాగనాయక్‌ భార్యపై కొడవలితో విచక్షణారహితంగా కాలు, చేయి నరికేయడంతో ఆమె కాలు, చేయి తెగిపడ్డాయి. గుర్తించిన బంధువులు బాధితురాలిని వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. భర్త పరారీలో ఉన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని