Crime news: వనస్థలిపురం లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య... ఫేస్‌బుక్‌ లైవ్‌

తాజా వార్తలు

Published : 22/08/2021 01:00 IST

Crime news: వనస్థలిపురం లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య... ఫేస్‌బుక్‌ లైవ్‌

హైదరాబాద్‌: వనస్థలిపురంలోని ఓ లాడ్జిలో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం(36) లారీ యజమాని. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయాడు. శనివారం ఉదయం అతని స్నేహితుడు వేణుగోపాల్‌తో కలిసి వనస్థలిపురం ఆటోసాయినగర్‌లోని వీఎంఆర్‌ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బార్‌లో మద్యం సేవించి గదిలోకి వెళ్లి పడుకున్నారు.

తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం సేవించారు. ఆతర్వాత షేక్‌ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అనంతరం తాను..చనిపోతున్నానని, ప్రేమించి మోస పోయానని.. స్నేహితులు మోసం చేశారని చెబుతూ ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకున్నాడు. ఈ దృశ్యాలు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉన్నాయి. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు ఫోన్‌ చేసినా ఫోన్‌ తీయలేదు. వేణుగోపాల్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో బ్రహ్మం ఉన్న గదికి వెళ్లాడు. గది తలుపులు వేసి ఉండటంతో కిటికీలోంచి చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. లాడ్జి సిబ్బంది వచ్చి తలుపులు తెరిచే సరికి అప్పటికే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బ్రహ్మం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మం బంధువులకు సమాచారమందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని