Suicide: బిడ్డకు జన్మనిచ్చి.. బావిలో దూకి బాలిక బలవన్మరణం

తాజా వార్తలు

Updated : 02/09/2021 06:42 IST

Suicide: బిడ్డకు జన్మనిచ్చి.. బావిలో దూకి బాలిక బలవన్మరణం

కామారెడ్డి నేరవిభాగం, గాంధారి, న్యూస్‌టుడే: గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలను ఆ బాలిక నమ్మింది. చివరికి గర్భం దాల్చింది. తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేయలేక, అతని మోసాన్ని ‘కడుపు’లోనే దాచుకుంది. 9నెలలపాటు మానసిక సంఘర్షణకు గురవుతూ నరకం అనుభవించింది. చివరికి బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఓ తండాలో బుధవారం ఈ దారుణం జరిగింది. గాంధారి ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం..  తండాకు చెందిన ఓ బాలిక (16)ది వ్యవసాయ కుటుంబం. 5వ తరగతి వరకూ చదువుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లేది. బుధవారం తెల్లవారుజామున తండా శివార్లలో మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే తల్లిగా మారాననే బాధ, భవిష్యత్తులో తలెత్తే సవాళ్లు, అవమానాలను తట్టుకోవడం కష్టమేననే బాధతో కుమిలిపోయింది. శిశువును పొదల్లో విసిరేసి, సమీపంలోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. శిశువును ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. ఆమెను మోసగించిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని