Road Accident: స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి!

తాజా వార్తలు

Updated : 18/09/2021 12:56 IST

Road Accident: స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి!

మోపిదేవి(కృష్ణా): కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కృష్ణా కరకట్టపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందారు. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అవనిగడ్డ పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి వస్తున్న కారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్తంభాన్ని ఢీకొని కరకట్ట పక్కనే ఉన్న కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో కైలా ప్రశాంత్‌(25) సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. సింహాద్రి శరత్‌ కాలికి గాయాలయ్యాయి. అతణ్ని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కారులో ఉన్న మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అటువైపుగా వస్తున్న నాగాలంక ఎస్‌ఐ శ్రీనివాస్‌ వెంటనే స్పందించి.. గ్రామస్థుల సహకారంతో కారులో ఉన్న నలుగురిని రక్షించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని