Suicide: క్షణికావేశంలో చిన్నారుల ప్రాణాలు తీసి తల్లి ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 15/08/2021 15:23 IST

Suicide: క్షణికావేశంలో చిన్నారుల ప్రాణాలు తీసి తల్లి ఆత్మహత్య

పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దారుణం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల: ఓ వివాహిత క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై తానూ ఉరేసుకున్న ఘటన ఆదివారం పిడుగురాళ్ల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులైన బండారి శ్రావణ్‌కుమార్‌కు మానసల(30)తో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి షర్మిల(3), జ్యోతి(2) సంతానం. శనివారం రాత్రి భోజనం చేసిన తరువాత భార్యాభర్తలిద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రించారు. అంతకుముందే భర్తతో గొడవ పడి ఉన్న మానస క్షణికావేశంలో చిన్నారులిద్దరి గొంతుకు చున్నీ బిగించి చంపేసింది. అనంతరం తానూ ఉరేసుకుంది. తెల్లవారుజామున భర్త తలుపుకొట్టి చూడగా ఎంతకీ స్పందన రాలేదు. దీంతో తలుపులు పగులగొట్టి కొట్టి లోపలికెళ్లి చూడగా.. అప్పటికే అంతా విగతజీవులుగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రావణ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని