Crime News : పులివెందులలో దొంగల బీభత్సం.. 

తాజా వార్తలు

Updated : 13/09/2021 14:46 IST

Crime News : పులివెందులలో దొంగల బీభత్సం.. 

పులివెందుల: కడప జిల్లా పులివెందులలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. స్థానిక భాకరాపురంలోని పాల కేంద్రం సమీపంలో నివసిస్తున్న లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. ఆమెను కత్తితో బెదిరించి కాళ్లు, చేతులు కట్టేశారు. ఆపై ఆమె చెవి దుద్దులు, బంగారు గొలుసు, బీరువాలో ఉన్న రూ.75వేల నగదు దోచుకెళ్లారు. అనంతరం ఆ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను కొంతదూరం వరకు తీసుకెళ్లి మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు.

వీటితో పాటు పట్టణంలోని పార్నపల్లె రోడ్డు మార్గంలోని ఓ దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి పరిశీలించి ఆమెను విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని