Crime News: తక్కువ ధరకే బంగారం.. విజయవాడలో భారీ మోసం

తాజా వార్తలు

Updated : 22/09/2021 18:43 IST

Crime News: తక్కువ ధరకే బంగారం.. విజయవాడలో భారీ మోసం

విజయవాడ: భారతీయులు.. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ తక్కువ ధరకే బంగారం వస్తుందంటే కాదనేవారు ఉండరు. ఈ ఇస్టాన్నే ఇద్దరు ఘరానా మోసగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి 57 మందిని మోసం చేశారు. బాధితుల నుంచి దాదాపు రూ.8 కోట్లు వసూలు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైల్వే ఉద్యోగి వెంకటేశ్వరరావు, నాగమణి గత 13 ఏళ్లుగా నగరంలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. నిందితులు ఆన్‌లైన్‌ రమ్మీలో రూ. 1.32 కోట్లు పోగొట్టుకున్నారు. పోయిన డబ్బును సంపాదించాలని నిందితులిద్దరూ పథకం వేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి కొంత మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అధిక వడ్డీ ఇస్తామని చెప్పడంతో మరి కొంత మంది బంగారం కూడా ఇచ్చారు. ఇలా రైల్వేలో పనిచేసే టీటీఈలు, దుర్గ గుడి ఉద్యోగులతో కలిపి మొత్తంగా 57 మంది నుంచి దాదాపు రూ.8 కోట్లు డబ్బు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వాళ్లు బంగారం అడగడంతో వ్యవహారం తెరపైకి వచ్చింది. బాధితులు వేధిస్తున్నారంటూ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి తీసుకున్న బంగారాన్ని నిందితులు ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టారు. నాగమణిని పోలీసులు అరెస్టు చేయగా.. వెంకటేశ్వరరావు రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మోసపోయిన బాధితులెవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని