గుజరాత్‌ టు విజయవాడ.. హెరాయిన్‌ సరఫరా వార్తలు అవాస్తవం: విజయవాడ సీపీ

తాజా వార్తలు

Updated : 20/09/2021 16:06 IST

గుజరాత్‌ టు విజయవాడ.. హెరాయిన్‌ సరఫరా వార్తలు అవాస్తవం: విజయవాడ సీపీ

విజయవాడ: గుజరాత్‌ నుంచి విజయవాడకు హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారనే వార్తలు అవాస్తవమని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. గుజరాత్‌ ముంద్రా పోర్టు నుంచి దిల్లీకి హెరాయిన్‌ తరలిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆషీ కంపెనీ లైసెన్స్‌లో విజయవాడ చిరునామా ఉందన్న మాట వాస్తవమే అయినా విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరగట్లేదన్నారు. చెన్నై, అహ్మదాబాద్‌, దిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయని చెప్పారు. విజయవాడ చిరునామాతో ఉన్న కంపెనీ యజమాని చెన్నైలో ఉంటారని.. చాలా ఏళ్ల క్రితమే చెన్నైలో స్థిరపడ్డారని సీపీ ప్రకటనలో వెల్లడించారు.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో రూ. 9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాల సమాచారంతో.. డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో తనిఖీలు చేయగా భారీగా హెరాయిన్‌ బయటపడింది. వాటి విలువ దాదాపు రూ. 9వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కంటైనర్లు అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్‌ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని