Hyderabad news: తెల్లబియ్యం తేలేదని భార్య ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 01/09/2021 04:38 IST

Hyderabad news: తెల్లబియ్యం తేలేదని భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌: బ్రౌన్‌ రైస్‌ తినలేక తెల్ల బియ్యం తేవాలని ఇంట్లో వాళ్లకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. నారాయణగూడలోని దత్తానగర్‌కు చెందిన రాంబాబు, స్వప్నకు 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇంటర్‌ చదివే కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాంబాబు క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. స్వప్న ఓ బేకరీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. నిత్యం ఇంట్లో బ్రౌన్‌ రైస్‌తో భోజనం చేస్తుంటారు. ఎప్పుడైనా తెల్లన్నం తినాలని ఉందంటే స్వప్న కోసం భర్త తెల్లబియ్యం ఒక కేజీ తెస్తుంటారు. కొంతకాలంగా రాంబాబు వైట్ రైస్‌ తీసుకురాకపోవడంతో.. చచ్చిపోతానంటూ స్వప్న హెచ్చరించింది. అయినా, ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు... శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని