Crime news: కుటుంబ కలహాలతో భర్తను నరికిన భార్య

తాజా వార్తలు

Updated : 06/09/2021 07:24 IST

Crime news: కుటుంబ కలహాలతో భర్తను నరికిన భార్య

తూగో జిల్లా లక్ష్మీపతిపురంలో కలకలం సృష్టించిన దారుణ హత్య

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది అతని భార్య. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపతిపురంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)కు, ఐ.పోలవరం మండలం కొమరగిరికి చెందిన దేవితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి అయిదో తరగతి చదివే కుమార్తె, మూడో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వీరు ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉండేవారు. ఇటీవల కోరంగి పోలీసుస్టేషన్‌లో గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఈ గొడవ విషయం అప్పారావు పనిచేస్తున్న కంపెనీలో తెలిసి పనిలోంచి తొలగించారు. అప్పటి నుంచి అప్పారావు ఇంటి వద్దే ఉంటున్నాడు. గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున అప్పారావును గొడ్డలితో నరికి హత్య చేసింది. భార్యే అతన్ని హత్య చేసినట్లు ఆధారాలున్నాయని కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ గ్రామీణ సీఐ మురళీకృష్ణ వెల్లడించారు. నిందితురాలు పరారీలో ఉందన్నారు. హత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని