crime news: ధన దాహం.. ప్రేమకు ద్రోహం

తాజా వార్తలు

Published : 20/08/2021 01:39 IST

crime news: ధన దాహం.. ప్రేమకు ద్రోహం

రాయపర్తి: ప్రేమ పేరుతో యువతి చేసిన మోసానికి యువకుడు బలయ్యాడు. కిలేడీ పన్నిన కుట్రలో వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన యువకుడు మృత్యు ఒడికి చేరాడు. గ్రామానికి చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ సందీప్‌(23)కు ఓ యువతితో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. కానీ, ఆ యువతి మాత్రం అతడి నుంచి సొమ్ము కాజేయాలని కుట్ర పన్నింది. తన స్నేహితులంటూ మరో ఇద్దరిలా మాట్లాడుతూ సందీప్‌ను నమ్మించింది. 

ఇలా వివిధ రకాలుగా మోసం చేస్తూ పలు దఫాలుగా రూ.లక్ష కాజేసింది. తీరా.. మోసపోయానని గ్రహించిన సందీప్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. హన్మకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే నిర్జీవిగా మారడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మరణానికి కారణమైన యువతిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సందీప్‌ మృతితో మొరిపిరాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని