Love: మేనత్తతో యువకుడి ప్రేమాయణం.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి..

తాజా వార్తలు

Updated : 30/08/2021 12:46 IST

Love: మేనత్తతో యువకుడి ప్రేమాయణం.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి..

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సిహావల్‌ మండలంలో ఓ యువకుడు తనకన్నా పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా ఇష్టపడింది. వారి మధ్య ప్రేమాయణం ఓ ఏడాది కాలం నడిచింది. ఈ క్రమంలోనే అత్త గర్భం దాల్చింది. ఆమెకు ఆరో నెల వచ్చేసరికి.. వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వారు ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. వంతెన పై నుంచి దూకి అత్మహత్య చేసుకున్నారు. మేనత్త, అల్లుడు ఒకే గ్రామానికి చెందిన వారు. ఆమె ఆరో నెల గర్భవతి అని తెలిసిన వెంటనే.. అత్త ఇంటికి చేరుకుని పెళ్లి విషయాన్ని అక్కడి వారికి చెప్పాడు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లు అతనికి వద్దు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వినలేదు. దీంతో ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి ఇంటి నుంచి పారిపోయారు. సమీపంలో ఉన్న సోన్‌ నది వంతెనపై నుంచి దూకారు. అటుగా వెళ్తున్న వారు నది ఇసుక తిన్నెలపై పడి ఉన్న జంటను చూసి, పోలీసులకు సమాచారం అందించారు. వారిని అమేలియాలోని అసుపత్రికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని