close

తాజా వార్తలు

Published : 15/01/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మల్లిఖార్జున స్వామి ఆలయంలో చోరీ

ఈపూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో కొలువైన  శ్రీభ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయంలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాలయంలో బుధవారం రాత్రి 11:30 గంటల వరకు గ్రామోత్సవం, తదితర పూజా కార్యక్రమాలు  నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. గేట్లు, తలుపులకు ఉన్న తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు...మల్లిఖార్జున స్వామికి ఇరువైపుల ఆసీనులైన భద్రకాళి, భ్రమరాంబికాదేవి మెడలో ఉన్న తాళి బొట్లు, ముక్కు పుడకలను అపహరించారు. గురువారం ఉదయం పూజలు చేయడానికి కోవెల వద్దకు వచ్చిన పూజారి నాగమల్లేశ్వర శర్మ చోరీ ఘటనను గమనించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సింగయ్య ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి..

మళ్లీ మూలాల్లోకి!

ట్రంప్‌ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదంTags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని