అంత్యక్రియలకు డబ్బుకోసం.. శవంతో బ్యాంకుకు!

తాజా వార్తలు

Published : 08/01/2021 01:16 IST

అంత్యక్రియలకు డబ్బుకోసం.. శవంతో బ్యాంకుకు!

పట్నా: బిహార్‌లో పట్నాకు సమీపంలోని ఓ గ్రామంలో గురువారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణించగా.. అతడి అంత్యక్రియలకు డబ్బు కావాలంటూ స్థానికులు మృతదేహాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లడం కలకలం సృష్టించింది. స్థానిక పోలీసు అధికారి అమరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా సమీపంలోని సింగ్రియవాన్‌ గ్రామానికి చెందిన చెందిన మహేష్‌ యాదవ్(55) అనే వ్యక్తి ఒంటరిగా జీవించేవారు.. అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందాడు. అతడి ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో.. మరణించిన తర్వాత చాలా సేపటికి చుట్టుపక్కల వారు మృతదేహాన్ని గుర్తించారు. 

మృతదేహాన్ని గుర్తించిన అనంతరం స్థానికులు.. అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి ఇంట్లో ఏమైనా డబ్బు దొరుకుతుందేమోనని పరిశీలించారు. ఈ క్రమంలో వారికి  అతడి బ్యాంకు పాస్‌బుక్‌ మినహా ఏమీ దొరకలేదు.అందులో రూ.1.17 లక్షలు ఉన్నట్టుగా ఉంది.  దీంతో అంత్యక్రియల ఖర్చులకై మృతుడి అకౌంట్‌లో డబ్బులు విత్‌డ్రా చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఏకంగా మృతదేహాన్నే తీసుకుని బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని ఆందోళనకు గురిచేశారు. ‘డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం.. లేదంటే అంత్యక్రియలు నిర్వహించేది లేదు’అని డిమాండు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని బ్యాంకు సిబ్బందికి నచ్చజెప్పడంతో అప్పుడు వారు కొంచం డబ్బును ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతరం గ్రామస్థులు అక్కడి నుంచి దహనవాటికకు వెళ్లి మహేష్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సంబంధిత బ్యాంకు మేనేజర్‌ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సదరు వ్యక్తులు సృష్టించిన సన్నివేశం  తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. తన సర్వీసులో ఇలాంటి ఘటన మొదటిసారి చూశానని చెప్పారు. 

ఇదీ చదవండి

మార్టూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని