మాస్కు లేదని జరిమానా.. మార్షల్‌పై మహిళ దాడి

తాజా వార్తలు

Published : 21/03/2021 02:01 IST

మాస్కు లేదని జరిమానా.. మార్షల్‌పై మహిళ దాడి

ముంబయి: మాస్కు ధరించలేదని జరిమానా విధించిన మహిళా మార్షల్‌పై ముంబయిలో దాడి జరిగింది. కరోనా పెరుగుదల దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) జరిమానా వసూలు చేస్తోంది. దీనిని అమలు చేసేందుకు మార్షల్స్‌ను నియమించింది.

అయితే ముంబయిలోని కండీవాలీలో మహవీర్‌నగర్‌ లింక్‌ రోడ్డు వద్ద జైనాద్‌ షేక్‌ అనే మహిళ మాస్కు లేకుండా బయటకు వెళ్లింది. ఇది గమనించిన అశ్విన్‌ గుంజన్‌ అనే మహిళా మార్షల్‌ జైనాద్‌ షేక్‌కు జరిమానా విధించారు. జరిమానా కట్టమని అడిగినందుకు మార్షల్‌పై జైనాద్‌ షేక్‌ దాడి చేసింది.  ‘నన్నే ఆపుతావా? నన్నే ముట్టుకుంటావా?’ అంటూ పూనకం వచ్చినట్లు సదరు ఉద్యోగినిపై దాడికి పాల్పడింది. మార్షల్‌ అశ్విని ఫిర్యాదు మేరకు జైనాద్‌ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని