రోడ్డు దాటేటపుడు నిర్లక్ష్యం తగదు

తాజా వార్తలు

Published : 17/06/2021 01:36 IST

రోడ్డు దాటేటపుడు నిర్లక్ష్యం తగదు

హైదరాబాద్‌: రోడ్డు దాటేప్పుడు అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుంది. రెప్పపాటు నిర్లక్ష్యం ఆస్పత్రిపాలు చేస్తుంది.  కుటుంబంలో విషాదం నింపుతుంది. రాయదుర్గంలో ఓ మహిళ రోడ్డు దాటే సమయంలో వాహనాల రాకపోకలను గమనించలేదు. ఇదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడు వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఒక్కసారిగా బండికి అడ్డంగా మహిళ రావడంతో ఆమెను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు, మహిళ గాయాలపాలయ్యారు. మహిళ స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 12న రాయదుర్గంలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలను సైబరాబాద్ పోలీసులు సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో వాహనాల రద్దీ ఎక్కువైంది కాబట్టి రోడ్డుదాటేటపుడు జాగ్రత్త వహించాలని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. అజాగ్రత్తగా రోడ్డు దాటి ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని