పేలిన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌.. మహిళ మృతి

తాజా వార్తలు

Published : 19/07/2021 01:03 IST

పేలిన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌.. మహిళ మృతి

జైపూర్‌: నాసిరకమైన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ పేలిపోయి ఓ ఉపాధ్యాయురాలు మృతిచెందారు. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని గంగాపూర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గంగాపూర్‌లోని ఉదాయ్‌మోర్‌ ప్రాంతానికి చెందిన సుల్తాన్‌సింగ్‌ రెండు నెలల నుంచి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆయన కోసం కుటుంబసభ్యులు ఓ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను కొనుగోలు చేయగా ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సంతోష్‌ మీనా.. భర్త సుల్తాన్‌సింగ్‌కు సపర్యలు చేస్తున్నారు.

శనివారం ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ స్విచ్‌ వేయగా భారీ శబ్దం చేస్తూ అది పేలిపోయింది. ఇంట్లో మంటలు చెలరేగాయి. శబ్దం విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని మంటల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. వారిరువురిని ఆసుత్రికి తరలిస్తుండగా.. తీవ్ర గాయాలపాలైన సంతోష్‌ మీనా మార్గం మధ్యలోనే మృతిచెందారు. సుల్తాన్‌సింగ్‌కు ప్రస్తుతం జైపూర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ నుంచి ఆక్సిజన్‌ లీకవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. నాసిరకమైన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేయొద్దని నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని