ఆమె గుండె ఆగింది.. అయినా ఉరి ఆగలేదు!

తాజా వార్తలు

Published : 04/03/2021 01:12 IST

ఆమె గుండె ఆగింది.. అయినా ఉరి ఆగలేదు!

తెహ్రాన్‌: సాధారణంగా దోషులకు ఉరిశిక్ష చాలా పకడ్బందీగా అమలు చేస్తుంటారు. ఉరిశిక్షకు ముందు ఖైదీకి అన్ని రకాల ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉంటేనే ఉరిశిక్ష వేస్తుంటారు. కానీ, ఇరాన్‌లో ఇటీవల ఓ మహిళ ఉరిశిక్ష పడే కొన్ని క్షణాల ముందే గుండెపోటుతో మృతి చెందింది. అయినా పోలీసులు ఆమె మృతదేహాన్ని ఉరికంభం ఎక్కించారు.

ఇరాన్‌కి చెందిన ఇద్దరు పిల్లల తల్లి జెహ్రా ఇస్మాయిలీ కొన్నాళ్ల కిందట తన భర్తను హత్య చేసింది. నిత్యం తనను, తన కూతుర్ని వేధిస్తుండటంతో భరించలేక భర్త ప్రాణాలు తీసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆత్మరక్షణ కోసం హత్య చేసినా ఒకరి ప్రాణాలు తీసిన నేరానికి ఆమెకు కోర్టు ఉరిశిక్ష విధించింది. గత వారం దేశ రాజధానికి 20 మైళ్ల దూరంలో ఉన్న కారజ్‌ పట్టణంలోని ఓ జైలులో జెహ్రా ఉరిశిక్ష అమలుకు అంతా సిద్ధం చేశారు. ఆమెతో పాటే మరో 16 మంది ఖైదీలకు పోలీసులు ఉరిశిక్ష అమలు చేశారు. క్యూలో తన ముందున్న వ్యక్తులు ఉరికంభం ఎక్కి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోవడం చూసి జెహ్రా ఆందోళనకు గురైంది. ఆ వెంటనే గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అయినా పోలీసులు చట్టం ప్రకారం ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాలని భావించారు. దీంతో జెహ్రా మృతదేహాన్ని తీసుకెళ్లి మెడకు ఉరి బిగించారు. ఆమె భర్త తల్లి.. మృతదేహాన్ని నిలబెట్టిన కుర్చీని తన్నడంతో ఉరిశిక్ష అమలు పూర్తయిందని ఈ కేసును వాదించిన న్యాయవాది తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని