గదిలో బంధించి.. కొన్నాళ్లుగా అత్యాచారం!

తాజా వార్తలు

Published : 09/06/2021 01:32 IST

గదిలో బంధించి.. కొన్నాళ్లుగా అత్యాచారం!

తిరువనంతపురం: నమ్మి వచ్చిన మహిళను ఓ వ్యక్తి గదిలో బంధించి.. కొన్నాళ్లపాటు లైంగికదాడికి పాల్పడిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. అతడి చెర నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

కొన్ని నెలల కిందట మార్టిన్‌ జోసెఫ్‌ పెలికొట్‌ అనే వ్యక్తితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని కలిసి ఉంటున్నారు. కొద్ది రోజులకే మార్టిన్‌ అసలు స్వరూపం బయటపడింది. ఆమెను గదిలో బంధించి విచక్షణారహితంగా ఆమెపై భౌతిక దాడికి దిగడంతోపాటు పలుమార్లు అత్యాచారం చేశాడు. బాధితురాలితో సన్నిహితంగా  ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసి వాటిని చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. దాదాపు రూ. 5లక్షలు బాధితురాలి నుంచి లాక్కున్నాడు. ఎవరికైన ఈ విషయాలు చెబితే వాటిని బయటపెడతానని బెదిరించాడు. కాగా.. మార్చిలో ఆమె ఇంటి నుంచి పారిపోయి మరో చోట ఆశ్రయం పొందింది. ఇటీవల ఎర్నాకుళం పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మార్టిన్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని