మరో వ్యక్తితో పారిపోయిన వివాహిత.. నగ్నంగా ఊరేగింపు

తాజా వార్తలు

Published : 16/07/2021 01:43 IST

మరో వ్యక్తితో పారిపోయిన వివాహిత.. నగ్నంగా ఊరేగింపు

అహ్మదాబాద్‌: వివాహమైన ఓ మహిళ మరో వ్యక్తితో పారిపోయింది. వెతికి పట్టుకున్న భర్త.. గ్రామ పెద్దలతో కలిసి ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని దహోడ్‌ జిల్లాలో గత నెలలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దహోడ్‌ జిల్లాలో ఓ గిరిజన ప్రాంతానికి చెందిన 23ఏళ్ల వివాహిత గత నెలలో మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆమె భర్త, గ్రామస్థులు కలిసి పలు చోట్ల గాలించి వారి ఆచూకీ గుర్తించారు. వారిని తిరిగి గ్రామానికి తీసుకొచ్చి జులై 6న పంచాయితీ పెట్టారు. పెళ్లైన తర్వాత మరో వ్యక్తితో పారిపోయినందుకుగానూ శిక్షగా ఆమె భర్త.. కుటుంబసభ్యులు కలిసి మహిళను కొట్టడంతో పాటు వివస్త్రను చేసి ఊరేగించారు. అంతేకాదు.. తన భర్తను భుజాన ఎత్తుకొని నడవాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో స్థానికంగా కలకలం రేపింది. అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్తతోపాటు మరో 18 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని