గంగిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ

తాజా వార్తలు

Updated : 19/06/2021 17:57 IST

గంగిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ

వైఎస్‌ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ 

కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని వరుసగా మూడోరోజు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై రెండేళ్ల కిందటే సిట్ అధికారులు ఎర్రగంగిరెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిలుపైన ఉన్న ఎర్రగంగిరెడ్డిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. వివేకాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయ పరమైన అంశాలన్నీ ఎర్రగంగిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. వివేకా ఎక్కడికి వెళ్లినా ఎర్రగంగిరెడ్డి తోడుగా వెళ్లేవాడు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో భాగంగా గతంలోనే సిట్ అధికారులు ఎర్రగంగిరెడ్డిని గుజరాత్ తీసుకెళ్లి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించారు. హత్య జరిగిన రోజు గదిలో సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపేయాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు వివేకాకు ఎర్రగంగిరెడ్డితో ఉన్న సంబంధాలు, ఆర్థిక విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని