ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల‌ హతం

తాజా వార్తలు

Published : 23/11/2020 00:41 IST

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల‌ హతం

గయా: బిహార్‌లోని గయాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో రూ.10 లక్షల రివార్డు ఉన్న జోనల్ కమాండర్‌ అలోక్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు. గయాలోని మాధురి గ్రామంలో మావోయిస్టులు ఇద్దరు వ్యక్తులను చంపారని సమాచారం అందుకున్న పోలీసులు.. 205 కమాండో బెటాలియన్‌తో కలిసి ఆ గ్రామ సమీపంలోని బారాచత్తి అడవిలో శనివారం అర్ధరాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనాస్థలి నుంచి ఓ ఏకే47, మరో తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో నలుగురు గ్రామస్థులు కూడా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం గయాలోని మెడికల్‌ ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని