TS News: ఈ గ్రామంలో మూడు రోజుల్లోనే 28 కేసులు..
eenadu telugu news
Updated : 29/07/2021 13:56 IST

TS News: ఈ గ్రామంలో మూడు రోజుల్లోనే 28 కేసులు..

ఆకెనపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు మూడు రోజుల్లో 28 కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 26వ తేదీన ఓ కుటుంబంలో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మరుసటి రెండు రోజుల్లో 23 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైద్య సిబ్బంది మూడు రోజుల నుంచి గ్రామంలో మకాం వేసి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు . ప్రస్తుతం కొవిడ్  సోకిన వారంతా ఇళ్లలోనే చికిత్స తీసుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని