
ప్రసాదరావు దృఢ సంకల్పం రాష్ట్రానికి ఆదర్శం
ప్రసాదరావు- దంపతులను సత్కరించిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉషారాణి, కాంతారావు
ఘంటసాలపాలెం(ఘంటసాల), న్యూస్టుడే : ఘంటసాలపాలెంకు చెందిన రైతు ప్రసాదరావు ఓర్పు, నేర్పు, దృఢ సంకల్పంతో వ్యవసాయంలో సాధించిన ప్రగతి రాష్ట్రానికి ఆదర్శనీయమని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరి వేమూరి ఉషారాణి పేర్కొన్నారు. బుధవారం ఘంటసాలపాలెంలోని అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు-సాయిలక్ష్మి దంపతులను కంట్రోలర్ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) డాక్టర్ కాంతారావు-ఉషారాణి దంపతులు సత్కరించారు. వారు మాట్లాడుతూ ప్రసాదరావు 170 ఎకరాల్లో కౌలు వ్యవసాయంతోపాటు 250కి పైగా పశువులతో పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తూ ఎంతో మంది యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. పదో తరగతి వరకు ఘంటసాల జడ్పీపాఠశాలలో చదివిన ఉషారాణి స్వగ్రామం ఘంటసాలపాలెం కావడంతో బంధు,మిత్రులను కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వేమూరి రాంబాబు, మూల్పూరి వెంకయ్య, సాయి వివేక్, విజయలక్ష్మి,బోయపాటి.శ్రీలక్ష్మి, వి.ధనలక్ష్మి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.