Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐస్‌క్రీం ఆశ చూపి అత్యాచారయత్నం!

పాఠశాల నుంచి తీసుకెళ్లిన యువకుడు

తప్పించుకొని వచ్చిన బాలిక

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఐస్‌క్రీం ఆశ చూపి బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఘటనపై గురువారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన 12 ఏళ్ల బాలిక ఓ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమె ఇంటి ఎదురుగా ఉండే 25 ఏళ్ల యువకుడు రోజూ ఆమె బయటకు వచ్చినప్పుడు పలకరిస్తూ వెంటపడేవాడు. ఇంటి ఎదుట ఉండే యువకుడు అని ఆమె పలకరిస్తుండేది. ఆమె సెల్‌ నంబర్‌ తీసుకొని తరచూ మాట్లాడుతుండేవాడు. ఈక్రమంలో ఆమె పాఠశాలకు వెళ్లగా ఐస్‌క్రీం తిని వద్దామంటూ పిలిచి తన ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాడు. ఓ లాడ్జిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి యత్నించగా ఆమె తప్పించుకొని వచ్చేసింది. అల్పాహారానికని చెప్పి వెళ్లిన బాలిక ఎంతసేపటికీ రాకపోవడంతో పాఠశాల నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తెలియజేశారు. వెంటనే ఆమె తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి వాకబు చేశారు. వారి ఇంటి ఎదురుగా ఉండే యువకుడు తీసుకువెళ్లినట్లు తెలుసుకున్నారు. ఆమె కోసం వెతుకుతుండగా బాలిక ఏడుస్తూ పాఠశాల వైపు రావడం చూసిన తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లి విచారించారు. తన ఇంటి వద్ద అబ్బాయి తీసుకువెళ్లి లైంగిక దాడికి యత్నించడంతో పారిపోయి వచ్చానని తెలిపింది. ఈ విషయమై నగరంపాలెం సీఐ మల్లికార్జునరావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని