Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆలయాల భద్రతపై దృష్టి పెట్టండి

డీఐజీ త్రివిక్రమవర్మ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆలయాల భద్రతపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయం నుంచి రేంజ్‌ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆలయాల భద్రతపై సమీక్షించారు. డీఐజీ మాట్లాడుతూ ఆలయాలకు, ప్రార్థన మందిరాల వద్ద నిఘా నేత్రాలు (సీసీటీవీలు) ఏర్పాటు చేయించాలన్నారు. ఆలయాల భద్రతకు గ్రామ స్థాయిలో స్థానిక యువతతో రక్షక దళాలు ఏర్పాటు చేయాలన్నారు. పగలు, రాత్రి పోలీసు గస్తీ పెంచాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీ ప్రకాశరావు, నెల్లూరు జిల్లా గూడూరు డీఎస్పీ రాజగోపాలరెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావులతో ఇప్పటి వరకు ఆలయాల ఘటనలకు సంబంధించి విచారణ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయా నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని