
ముగిసిన అంతర్ జిల్లాల అథ్లెటిక్స్
ఓవరాల్ ఛాంపియన్ దక్కించుకున్న ప్రకాశం జిల్లా క్రీడాకారులు
ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో బాలుర విభాగంలో 65 పాయింట్లతో ప్రకాశం, బాలికల విభాగంలో 54 పాయింట్లతో విశాఖపట్నం జిల్లా జట్లు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పోటీలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు 33 ఈవెంట్లు నిర్వహించారు. అన్ని జిల్లాల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకాశం జట్టు అత్యధికంగా 16 బంగారు పతకాలను సాధించింది. శ్రీకాకుళం జిల్లా 11 బంగారు, 10 వెండి, 6 కాంస్యం, విశాఖ జిల్లా 10 బంగారు, 14 వెండి, 3 కాంస్యం, విజయనగరం జట్టు 15 బంగారు, 5, వెండి, 5 కాంస్యాలతో సత్తా చాటాయి. అతిథ్య గుంటూరు జట్టు 5 బంగారు, 7వెండి, 6 కాంస్య పతకాలు, కృష్ణాజిల్లా 4 బంగారు, 8 వెండి, 9 కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. విజేతలకు ఏఎన్‌యూ వ్యాయామ కళాశాల సంచాలకులు డాక్టర్ పాల్‌కుమార్, ఏఎఫ్ఐ సంయుక్త కార్యదర్శి ఆకుల రాఘవేంద్ర, భారత అథ్లెటిక్స్ టీం కోచ్ రమేష్, ఏపీ అథెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హైమావతి, శాప్ పరిశీలకులు వంశీ, ఏఎన్‌యూ యోగా విభాగం సమన్వయకర్త డాక్టర్ సూర్యనారాయణ బహుమతులు ప్రదానం చేశారు.
బాలికల విభాగంలో విశాఖపట్నం క్రీడాకారిణులు
ఉత్తమ క్రీడాకారులు వీరే..
అండర్-14: కిషోర్(గిరిజన సంక్షేమ శాఖ), శైలు (అనంతపురం),
అండర్-16: సాయి శ్రీనివాస్(విశాఖ), హిమవర్ష (అనంతపురం)
అండర్-18: శరత్చంద్ర(నెల్లూరు), లక్ష్మి(విజయనగరం),
అండర్-20: యశ్వంత్‌కుమార్(శ్రీకాకుళం), రజిత (తూర్పుగోదావరి)