Updated : 22/01/2021 08:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముసుగులు ధరించి.. కత్తులతో బెదిరించి..!

సినీ ఫక్కీలో చోరీ.. మేడికొండూరులో కలకలం


బాధిత కుటుంబం

మేడికొండూరు, న్యూస్‌టుడే: ముసుగులు ధరించి వచ్ఛి.మహిళను కత్తులతో బెదిరించి సినీ పక్కీలో చోరీకి పాల్పడిన సంఘటన గురువారం మేడికొండూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మేడికొండూరుకు చెందిన వెంకటరమణారావు గురువారం తెల్లవారు జామున పాలప్యాకెట్‌ తీసుకొచ్చేందుకు బజారుకు వెళ్లాడు. ఇది గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు తలకు టోపి, నోటికి గుడ్డలు కట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న వెంకటరమణారావు భార్య విజయలక్ష్మి పట్టుకుని మాట్లాడితే చంపుతామని కత్తులతో బెదిరించారు. ఆమె చేతికి ఉన్న బంగారం ఉంగరం, మెడలో ఉన్న మంగళ సూత్రం, చెవిదిద్దులు లాక్కున్నారు. బీరువాలో ఉన్న రూ.900లు తీసుకుని పరారయ్యారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నరహరి తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. వేలిముద్రల నిపుణులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మొత్తం రూ.16000 విలువ గల వస్తువుల చోరీ జరిగిందని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని