Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తగ్గుతున్న కరోనా కేసులు

 

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా వైరస్‌ కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కేసుల సంఖ్య 17 నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 75,355కు చేరింది. కొవిడ్‌ బారిన పడిన వారిలో ఇంతవరకు 74,450 మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. 669 మంది మరణించారు. ప్రస్తుతం 236 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ మేరకు: బెల్లంకొండ-1, ముప్పాళ్ల-1, పెదనందిపాడు-1, తాడేపల్లి-4, తుళ్లూరు-1, గుంటూరు-3, పిడుగురాళ్ల-1, చిలకలూరిపేట-1, నరసరావుపేట-3, పొన్నూరు-1.

ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కొవిడ్‌ టీకా కేంద్రాలు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో పని చేసేవారికి ఆ కేంద్రాల్లో టీకా వేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ టీకా వేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంపణీ కేంద్రాలను పెంచుతున్నారు. గురువారం 31 కేంద్రాల్లో 928 మందికి కొవిడ్‌ టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 8,780 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని