Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

3 గంటలు నరకం చూసిన ప్రజలు..!

ఉండవల్లి కూడలిలో నిలిచిపోయిన వాహనాలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: విజయవాడలో సీఎం కార్యక్రమం సందర్భంగా దారి మళ్లించిన వాహనాలను క్రమబద్ధీకరించడంలో పోలీసులు విఫలం కావడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని 3గంటలపాటు నరకాన్ని చవిచూశారు. తాడేపల్లి పట్టణంతోపాటు మంగళగిరి, అమరావతికి ప్రధాన కూడలిగా ఉన్న ఉండవల్లి సెంటర్‌లోనూ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. క్రమబద్ధీకరణలో పోలీసులు చొరవ చూపకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉండవల్లి కూడలి నుంచి ప్రకాశం బ్యారేజీ, తాడేపల్లి, ఉండవల్లి కూడలి మధ్య, పెనుమాక, ఉండవల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. వాహనాలను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు మూడుగంటల సమయం పట్టింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని