Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసు పహారాలో తాడేపల్లి..!

ఒకవైపు భాజపా ఆందోళన, మరో వైపు సీఎం పర్యటన బందోబస్తు

డీజీపీ కార్యాలయానికి వెళ్లే మార్గాలన్నీ మూసివేత


తాడేపల్లిలో పోలీసు బలగాలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఒకవైపు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించేందుకు భాజపా కార్యకర్తలు వస్తారన్న సమాచారంతోపాటు..మరోవైపు బియ్యం పంపిణీ వాహనాలను విజయవాడలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. తాడేపల్లిలో పోలీసులు భారీగా మొహరించారు. ఎక్కడికక్కడ ఆయా మార్గాల్లో వెళ్లే వాహనాలను క్రమబద్ధీకరించడంతోపాటు డీజీపీ కార్యాలయానికి బయట వ్యక్తులెవరూ రాకుండా ఉండేవిధంగా చర్యలు చేపట్టారు. డీజీపీ కార్యాలయానికి ఇరువైపులా 100 మీటర్లు దూరంలో బారికేడ్‌లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొలనుకొండ వద్ద జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డులోకి వచ్చే మార్గంతోపాటు మంగళగిరి వైపు నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్లే రహదారులు ప్రత్యేక పోలీసు బలగాలతో మూసివేశారు. 2 కిలోమీటర్ల మేర డీజీపీ కార్యాలయం ముందు భాగంలోని సర్వీసు మార్గంలో అడుగడుగునా పోలీసులను ఉంచారు. పట్టణంలోని ప్రాతూరు కరకట్ట మార్గంలో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయన్ని బయటకు రానివ్వకుండా పోలీసులు మొహరించారు. ముఖ్యమంత్రి విజయవాడ పర్యటన సందర్భంగా ఆయన నివాసం వద్ద నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఎం వెళ్లేవరకు ఆ మార్గంలో ఎవరినీ అనుమతించ లేదు. దీనితో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఉన్నప్పటకీ వాటిని క్రమబద్ధీకరించలేకపోయారు. ఫలితంగా వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని