Published : 22/01/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిక్సర్లతో చెలరేగిన సుసంకీర్త్‌

కేడీసీఏ ‘ఏ’ క్రికెట్‌ లీగ్‌


ఎ.సుసంకీర్త్‌ (159 పరుగులు)

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కొండపల్లి సీసీ జట్టుకు చెందిన ఎ.సుసంకీర్త్‌ శతకం (159)తో సత్తా చాటాడు. 11 సిక్సర్లు, ఎనిమిది బౌండరీలతో మోత మోగించి జట్టును విజయపథంలో నడిపించాడు. రాయల్‌ సీసీ జట్టుకు చెందిన రూపేష్‌ (93 నాటౌట్‌, 4/39), వీవీకేఆర్‌ఎం సీసీ జట్టుకు చెందిన ఎ.బ్రహ్మతేజ (93, 3/47) ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించి జట్టు విజయానికి దోహదపడ్డాడు. జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాట్రగడ్డ మధుసూధనరావు స్మారక కేడీసీఏ ‘ఏ’ డివిజన్‌ క్రికెట్‌ లీగ్‌ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.


రూపేష్‌ (93 నాటౌట్‌, 4/39)

196 పరుగుల ఆధిక్యంతో కొండపల్లి సీసీ జట్టు విజయం

మూలపాడులోని కేడీసీఏ ‘ఏ’ క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కొండపల్లి సీసీ జట్టు 196 పరుగుల ఆధిక్యంతో ఎవరెస్ట్‌ సీసీ జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కొండపల్లి సీసీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. జట్టులో ఎ.సుసంకీర్త్‌ సెంచరీతో (159 పరుగులు; 150 బంతులు; 48, 611) తో చెలరేగగా, వంశీ (62), అనంత కార్తికేయన్‌ (54)లు రాణించారు. ప్రత్యర్థి బౌలర్లు టీవీ సిద్దార్థ 70 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చగా.. ఎస్‌కే రెయాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన ఎవరెస్ట్‌ సీసీ జట్టు 49.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థి బౌలర్లు గుణ, సూర్య చెరో రెండేసి వికెట్లు కూల్చారు.


ఎ.బ్రహ్మతేజ (93 పరుగులు, 3/47)

61 పరుగుల ఆధిక్యంతో రాయల్‌ సీసీ జట్టు గెలుపు.. మూలపాడులోని ‘బి’ క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ సీసీ జట్టు 61 పరుగుల ఆధిక్యంతో రైల్వేస్‌ సీసీ జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచిన రాయల్‌ సీసీ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకొని నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. జట్టులో రూపేష్‌ (93 నాటౌట్‌; 63 బంతులు; 48, 63)క్రీజ్‌లో నిలవగా.. ఎం.హర్ష (46), జగదీష్‌ (29), ప్రభుకిరణ్‌ (44), స్వరూప్‌కుమార్‌ (26) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ జట్టు 40.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లు రూపేష్‌ నాలుగు, ఎ.వాసు మూడు, స్వరూప్‌కుమార్‌ రెండు వికెట్లు పడగొట్టారు.


టీవీ సిద్ధార్థ (4/70)

వీవీకేఆర్‌ఎం సీసీ జట్టు విజయం

మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో వీవీకేఆర్‌ఎం సీసీ జట్టు 23 పరుగుల ఆధిక్యంతో ఆంధ్రా బ్లూస్‌ సీసీ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వీవీకేఆర్‌ఎం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. జట్టులో ఎ.బ్రహ్మతేజ (93), వెంకట వంశీకృష్ణ (23), నితిక్‌ (27) రాణించారు. ఛేదనలో ఆంధ్రా బ్లూస్‌ సీసీ జట్టు 41.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లు భీమారావు, ఎ.బ్రహ్మతేజ చెరో మూడేసి వికెట్లు కూల్చగా.. నితిక్‌ రెండు వికెట్లు తీశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని