
నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం
రేపు ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ మీడియా సమావేశం
అమరావతి: ఏపీలో రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికల నిర్వహణపై ఈ సాయంత్రం పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ హాజరుకావాల్సి ఉంది. తొలి దశలో నిర్వహించే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు ఏయే జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చించనున్నారు. మరోవైపు రేపు ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశం ద్వారా తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి..
ఆర్టీసీ బస్సులో ‘అనంత’ కలెక్టర్
కాకినాడ ఫిషింగ్ హార్బర్లో బోటు దగ్ధం