Published : 13/04/2021 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతుల దుర్మరణం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం పాలైన సంఘటన చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గూడవల్లి కూడలికి సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గన్నవరం మండలం జక్కులనెక్కలంకు చెందిన కాట్రు వెంకటేశ్వరరావు(62), మాకుల కోటేశ్వరరావు(63) సాయంత్రం వ్యవసాయ, వ్యక్తిగత పనుల నిమిత్తం గూడవల్లి వచ్చారు. పనులు ముగించుకున్న ఇద్దరు తమ ద్విచక్ర వాహనంపై గ్రామానికి బయలుదేరారు. తిరిగి వెళ్తూ.. గూడవల్లి కూడలి వద్ద నిలిచి ఉండగా ఎదురుగా గూడవల్లి నుంచి ఉప్పులూరు వెళ్లే భారీ క్రేన్‌కు బ్రేకులు ఫెయిల్‌ అవడంతో ఒక్కసారిగా వారి ద్విచక్ర వాహనంపైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. కోటేశ్వరరావుని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. గన్నవరం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. వెంకటేశ్వరరావుకు భార్య, పెళ్లైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కోటేశ్వరరావుకు భార్య, పెళ్లైన ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామస్థులతో ఎంతో కలివిడిగా ఉండే ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని