Updated : 13/04/2021 08:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాఠాలు చెబుతూ.. ప్రాణాలొదిన ఉపాధ్యాయిని

చినపారుపూడి (పెదపారుపూడి): విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉపాధ్యాయిని గుండెపోటుతో మృతిచెందిన ఘటన చినపారుపూడి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. మసిముక్కు శ్రీదేవి(54) ఉదయమే పాఠశాలకు వచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రధానోపాధ్యాయుడు మోహన్‌రావు, ఉపాధ్యాయులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతిచెందారు. గుండెపోటుతో మృతిచెందినట్లు వారు తెలిపారు. ఆమె మృతికి పలు సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని