Published : 13/04/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

నిందితుడు తిరుపతిరావు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : భార్యను హత్యచేసిన కేసులో భర్తను నగరంపాలెం పోలీసులు సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని మీడియా కంటపడకుండా అరెస్టు చేసి పంపించడం పలు సందేహాలను రేకెత్తిస్తుంది. శ్రీనివాసరావుపేటకు చెందిన శిరీష(25)కు పొన్నూరు మండలం వెల్లలూరుగ్రామానికి చెందిన కోట తిరుపతిరావుతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. ఆయన  ఓ ప్రయివేట్‌ కేబుట్‌డిష్‌ కంపెనీలో పనిచేసేవాడు. భార్య శిరీషపై అనుమానంతో తరచూ వేధించేవాడు. దీంతో ఆమె భర్తపై కేసు పెట్టింది.దీనితో భార్యపై కక్ష్యపెట్టుకున్నాడు. ఈక్రమంలో గత నెల 26న ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా కత్తితో దాడిచేసి హతమార్చాడు. నిందితుడు సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ సదరు ఎస్సై గత కొంతకాలంగా తనను వేధించడంతోపాటు కొద్ది రోజులు కిందటే అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టాడంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ కేసులో సదరు ఎస్సైను స్టేషన్‌విధుల నుంచి తప్పించి వీఆర్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని