Published : 13/04/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘చంద్రబాబు సభపై రాళ్ల దాడి అవాస్తవం’

ఏపీ హోం మంత్రి సుచరిత

అమరావతి: తిరుపతిలో తెదేపా అధినేత చంద్రబాబు సభపై రాళ్ల దాడి జరిగిందనడం అవాస్తవమని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..సానుభూతి కోసమే రాళ్ల దాడి జరినట్లు చిత్రీకరించారని విమర్శించారు. రాళ్ల దాడి చేయాల్సిన అవసరం వైకాపాకు లేదని పేర్కొన్నారు. తిరుపతిలో వైకాపా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారన్న నమ్మకం ఉందన్నారు. సంక్షేమ పథకాలే వైకాపా అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసును కూడా భూతద్దంలో చూపిస్తున్నారని, త్వరలోనే నిజాలు బయటకొస్తాయని హోం మంత్రి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని