AP News: తాడేపల్లిలో ఒకే ఇంట్లో రెండు మృతదేహాల కలకలం
eenadu telugu news
Updated : 29/07/2021 16:38 IST

AP News: తాడేపల్లిలో ఒకే ఇంట్లో రెండు మృతదేహాల కలకలం

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు స్థానికంగా కలకలం రేపాయి. బకింగ్‌హమ్‌ కెనాల్‌ పక్కనే ఉన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి.  పోలీసులు ఇంటి మొత్తాన్ని క్షుణ్నంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కనీసం వారి ఊరు, పేరు ఇతర వివరాలు ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యభర్తల మృతదేహాలు పడి ఉన్న ప్రాంతంలో మందులు, ఇతర ఆధ్యాత్మిక సీడీలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు దొరికినట్టు సీఐ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారం లభించలేదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని