close

శుక్రవారం, మే 29, 2020

తాజా వార్తలు

కార్మిక చట్ట సవరణ సరికాదు

అనంతలో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు
 

ఆజాద్‌నగర్‌: కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల సవరణలను విరమించుకోవాలని ఆ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా శుక్రవారం బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఏఐటీయూసీ నాయకుడు రాజారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఓబులు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు అమీర్‌బాషా, ఐఎఫ్‌టీయూ ఉపేంద్ర, ఏఐయూటీయూ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పని గంటలు 12కు పెంచడం బాధాకరమన్నారు. కార్మికుల శ్రమను దోపిడీకి చట్టాలను సవరణ చేస్తున్నారని మండిపడ్డారు.

రూ.10 వేల సాయం అందించాలి... భవన నిర్మాణ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేసి, ఆదుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌, రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తహసీల్దార్లకు వినతిపత్రాలను అందజేశారు.

అనంత నగరపాలిక : ఒప్పంద కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో చేతులు కట్టేసుకొని, నోర్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన చేపట్టారు. పారిశుద్ధ్య విభాగ మస్టర్‌ కార్యాలయాల వద్ద ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు రూ.18 వేలు చెల్లించాలి, రెగ్యులర్‌ కార్మికులకు జీపీఎఫ్‌ అమలు చేయాలి, పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నాగభూషణం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జిల్లాలోని పుట్టపర్తి, కదిరి, హిందూపురం ప్రాంతాల్లో కార్మికులు నిరసన తెలిపారు.

భద్రత కల్పించాలి

పుట్టపర్తి గ్రామీణం : నగర పంచాయతీ ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండు చేశారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తాము, తమ కుటుంబాలు అభద్రతలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బీడుపల్లి నీటి సరఫరా పథకం వద్ద విధులు నిర్వహిస్తూ తలకిందులుగా నిలబడి నిరసన తెలిపారు.

తలకిందులుగా నిలబడి నిరసన తెలుపుతున్న కార్మికులు​​​​​​​

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.