Published : 13/04/2021 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉత్సాహంగా వచ్చారు.. ఉసూరుమంటూ వెళ్లారు..

నిరాశగా వెనుతిరుగుతున్న వాలంటీర్లు  

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: సత్కారం చేస్తారు.. నగదు ప్రోత్సాహకం ఇస్తారు.. పండగను బాగా చేసుకుందామని వచ్చిన వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం వాలంటీర్లకు ఉగాది పండగ రోజున సత్కారం చేయాలని నిర్ణయించింది. సోమవారం స్థానిక మార్కెట్‌యార్డులో కార్యక్రమం ఏర్పాటుచేయగా.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మున్సిపాలిటీతో పాటు ఐదు మండలాల నుంచి సుమారు 1400 మంది వాలంటీర్లు ఉదయాన్నే తరలివచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. 11.45 గంటలకు డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీఎల్‌డీవో) శివారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట రాముడు సభా స్థలి వద్దకు వచ్చి కొన్ని అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా పడిందని, తమ తమ గ్రామాలకు వెళ్లిపోవాలని చెప్పారు. దాంతో వాలంటీర్లు, వారి వెంట వచ్చిన వారు నిరాశ చెందారు. కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేశారో అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, వాలంటీర్లకు కారణాలు తెలియలేదు. దీంతో ఏం చేయలేక వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని