
మాగ్నైట్ కారును ఆవిష్కరిస్తున్న బసిరెడ్డి, మురళి, జగన్నాథరెడ్డి
తిరుపతి(నగరం): తిరుపతి మార్కెట్లోకి నిస్సాన్ సరికొత్తగా రూపొందించిన మాగ్నైట్ కారు అందుబాటులోకి వచ్చింది. బుధవారం స్థానిక రేణిగుంట రోడ్డులోని నిస్సాన్ షోరూంలో మాగ్నైట్ కారును డీటీసీ బసిరెడ్డి, ఎంవీఐ మురళి, సిటీకేబుల్ అధినేత రాజశేఖర్రెడ్డి ఆవిష్కరించారు. షోరూం ఎండీ జగన్నాథరెడ్డి మాట్లాడుతూ కారు ఎక్స్ షోరూం ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందన్నారు. కొనుగోలుదారులు ఇతర వివరాల కోసం చరవాణి నెం.90004 54634 సంప్రదించాలని ఆయన కోరారు.