
పోలీసు అధికారులతో సమీక్షిస్తున్న అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి
తిరుపతి(నేరవిభాగం): వాహనదారులు ఈ-చలానా స్టేటస్‌ను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న జరిమానాలు వెంటనే చెల్లించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి అన్నారు. బుధవారం పోలీసు అతిథి గృహంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై అర్బన్ జిల్లా పరిధిలో డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి ఈ-చలానా జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. వివరాలు మెసేజ్ రూపంలో వాహనదారుడి రిజిస్ట్రేషన్ చరవాణి నంబరుకు వెళుతుందని పేర్కొన్నారు. 15 రోజుల్లోపు ఈ-జరిమానా చెల్లించాలని కోరారు. చెల్లించని వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రూ.9 కోట్లు, తిరుపతిలో సుమారు రూ.3 కోట్లు జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కోరారు. అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరిఫుల్లా, మునిరామయ్య, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.