
బాధ్యతగా పనిచేద్దాం..
మాట్లాడుతున్న పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా
అధ్యక్షుడు పీఎంఆర్ ప్రభాకర్
చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేసి ప్రజల మన్నన పొందడానికి కృషి చేయాలని ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు పీఎంఆర్ ప్రభాకర్ అన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఉద్యోగుల సంఘం జడ్పీ యూనిట్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. అనంతరం సంఘం జడ్పీ యూనిట్లో ఖాళీగా ఉన్న పదవులను ఏకగ్రీవంగా భర్తీ చేశారు. ఉపాధ్యక్షుడిగా ఉపేంద్ర(ఏవో), సంయుక్త కార్యదర్శిగా నిరంజన్‌రెడ్డి(ఎగువశ్రేణి సహాయకుడు), జిల్లా కౌన్సిలర్లుగా మహబూబ్‌బాషా (రికార్డు అసిస్టెంట్)ను ఎంపిక చేశామని ప్రకటించారు. సమావేశంలో సంఘం కార్యదర్శి రాజేంద్ర, ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నాయకులు బాబు, మనోహర్, భువనేశ్వరప్రసాద్, గోవిందస్వామి, సురేష్‌కుమార్, లక్ష్మీపతి, ఏవోలు చలపతిరెడ్డి, శ్రీనివాసులు, మహ్మద్ఆలీఖాన్ పాల్గొన్నారు.