Published : 03/12/2020 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్‌కు సిబ్బంది జాబితా సిద్ధం చేయాలి

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచి.. పాజిటివ్‌ కేసుల రేటును తగ్గించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని సచివాలయాలు-అభివృద్ధి జేసీ వీరబ్రహ్మం ఆదేశించారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలపై పీహెచ్‌సీ వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు విధిగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఆసుపత్రుల్లో పనిచేసే వర్కర్ల జాబితాను త్వరగా సమర్పించాలన్నారు. పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వ ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిని సందర్శించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.

బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తాం : ఆర్‌ఎం

సదుం: తుపాను ప్రభావంతో వివిధ మార్గాల్లో రద్దయిన ఆర్టీసీ బస్సులను పునరుద్ధరిస్తున్నామని రీజనల్‌ మేనేజర్‌ (తిరుపతి) చెంగల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన తిరుపతి నుంచి పుంగనూరు వరకు రహదారి మార్గాన్ని పరిశీలించారు. సదుంలో వంతెన దెబ్బతినడంతో కలకటవారిపల్లె మీదుగా పుంగనూరుకు బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 900, తమిళనాడుకు 90 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. రైతులు ఆర్టీసీ కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీలేరు డిపో మేనేజర్‌ వీరాస్వామి, మాజీ సర్పంచి సయ్యద్‌బాషా పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని