
వసంత మండపంలో అచ్యుతార్చన, గోపూజ
గోపూజ నిర్వహిస్తున్న అర్చకులు. చిత్రంలో ఓఎస్డీ డాలర్ శేషాద్రి
తిరుమల: కార్తికమాసంలో తితిదే ఆధ్వర్యంలో చేపట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధవారం అచ్యుతార్చన, గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వసంత మండపంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ.. గోవు సకల దేవతా స్వరూపమన్నారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, గోప్రదక్షిణ నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు సుందరవదనాచార్యులు, ఓఎస్డీ డాలర్ శేషాద్రి పాల్గొన్నారు.
Tags :